కేరళ రాష్ట్రానికి పొంచి ఉన్నామరో ప్రమాదం 

There is a danger of the state of Kerala

There is a danger of the state of Kerala

 Date:24/09/2018
తిరువనంతపురం ముచ్చట్లు:
కేరళ రాష్ట్రానికి మరో ప్రమాదం పొంచి ఉంది. కేర‌ళ‌లో వ‌చ్చే 4 రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ కేర‌ళ డైరెక్ట‌ర్ సోమ‌వారం పేర్కొన్నారు. వ‌చ్చే 5 రోజుల్లో కేర‌ళ వ్యాప్తంగా వ‌ర్షాలు విస్త‌రిస్తాయ‌ని అంచ‌నా వేశారు.
ఆ రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు తాజాగా వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ 25-26 మధ్య ఈ జిల్లాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు తెలిపింది. పతానంతిట్ట, వాయానంద్, పాలక్కడ్, ఇడుక్కి, త్రిసూర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఆయా జిల్లా అధికారులు నిరంతరం అలర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక బృందాలను అందుబాటులో ఉంచారు.నెల రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన అతి భారీ వర్షాల కారణంగా చరిత్రలో ఎన్నడూ లేనంతగా కేరళ రాష్ట్రం అతలాకుతలమైంది.
దాదాపు రెండు వారాల పాటు రాష్ట్రమంతా తడిసి ముద్దెంది. వరదల వల్ల దాదాపు 488మంది మృతి చెందగా.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కోలుకుంటోంది.
Tags:There is a danger of the state of Kerala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *