ముఖ్యమంత్రిగా జగన్ అవసరం ఎంతో ఉంది -జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు
పుంగనూరు ముచ్చట్లు:
ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులై జయప్రదం చేయాలని జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కార్యాలయంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కన్వీనర్లు, బూత్‌కమిటి మెంబర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పాల్గొని మా నమ్మకం నువ్వే జగన్ కరపత్రాలను పంపిణీ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పకడ్భంధిగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమ పథ కాలను ప్రజలకు వివరించి, వారి చేతనే పుస్తకాలు భర్తీ చేసి , సంతకం చేయించుకోవాలన్నారు. రాష్ట్రానికి జగన్‌మోహన్‌రెడ్డి అవసరం ఎంతో వివరించాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను చైతన్య పరచి ఓట్లు కోరాలన్నారు. ఈనెల 9 నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరారు. ఎంపీపీ మాట్లాడుతూ ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, ఆర్టీసి మజ్ధూర్ అధ్యక్షుడు జయరామిరెడ్డి, నియోజకవర్గ ఎలక్ట్రోల్ ఇన్‌చార్జ్ రవితేజరెడ్డి, పార్టీ నాయకులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్, రమణ, సుబ్రమణ్యం, ప్రభాకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags: There is a great need for Jagan as Chief Minister – ZP Chairman Srinivasulu
