సినారె సంకలనం లో ముగ్గరు పురసం రచయితలకు స్థానం..

పుంగనూరు ముచ్చట్లు:

తెలుగు సినీ ప్రపంచంలో ఐదు పదుల కాలం పాటు పండితుల నుంచి సామాన్యుల వరకు అందర్నీ ఆకట్టుకునే సినీ గీతాలు రచించిన ప్రముఖ కవి సినారే పై వెలువడిన సంకళనంలో పుంగనూరు కు చెందిన ముగ్గురు కవులకు చోటు లభించింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద తెలుగు కవులందరి కవితలతో కూడిన విశ్వంభరుడు అనె సంకలనంను కరీంనగర్ నుంచి సాహితీవేత్త వైరాగ్యం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ప్రచురింపబడినది ఇందులో రాష్ట్రస్థాయి మరియు క్షేత్రస్థాయి కవిత విన్యాసంలో కాకలు తీరిన దిగ్గజాలు తమ కవితలను అందించారు. వీరి తరపున పుంగనూరు రచయితలు సంఘానికి చెందిన అధ్యక్షులు పరంకుశం నాగరాజ,సాల్వరాజు సతీష్ కుమార్,హేమలత లు రచించిన అక్షర శరనిధి శబ్ద వేది సి.నా.రే మీకు జోహార్లు..

 

 

బహుముఖ ప్రజ్ఞాశాలి.. మా సినారె సామ్రాట్టు.అన్న అద్భుత కవిత రచనలు ప్రచురింపబడ్డాయి. ఈ సందర్భంగా రచనలలో ప్రతిభ కనపరచిన రచయితలను పుంగనూరు పట్టణ ప్రముఖులు, నాయకులు,ప్రజలు,అభిమానులు అభినందించి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.ఇక రాబోయే రోజుల్లో కూడా మును ముందు కు మరిన్ని కొత్త రచనలతో పుంగనూరు కు రచయితలు మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించి మరింత గుర్తింపు తీసుకు రావాలని రచయితలను అభిమానులు కోరారు.

Tags: There is a place for three Purasam writers in Sinare’s anthology.

Leave A Reply

Your email address will not be published.