Natyam ad

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన

-నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల ముచ్చట్లు:


నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 23  వార్డు  ఏకలవ్య నగరంలో శనివారం నాడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి  పాల్గొన్నారు.  ప్రజలకు సంక్షేమ పథకాలు వివరిస్తూ మరోసారి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వార్డు ప్రజలను ఎమ్మెల్యే కోరారు.. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ 23 వ వార్డు లో  ప్రతి గడప తిరుగుతూ సంక్షేమ పథకాలతో పాటు వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకొని అక్కడే ఉన్న అధికారులతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ పథకలు రావాలంటే లంచం లేనిదే ప్రజలకు అందేవి కావని చంద్రబాబు చేసిన మోసాలను రాష్ట్ర ప్రజలు గుర్తించారని ప్రజలు వైఎస్సార్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు . తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మళ్లీ రాష్ట్రంలో జగనన్నను ముఖ్యమంత్రి ని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మభూన్నిసా, వైస్ చైర్మన్ పాం షావాలి. కౌన్సిలర్ రాజ్యలక్ష్మి. వైసీపీ నేతలు పార్థుడు. మున్సిపల్ కమిషనర్ రవి చంద్రా రెడ్డి. అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్. సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

 

Post Midle

Tags: There is a remarkable response from the people to the program of our government

Post Midle

Leave A Reply

Your email address will not be published.