అనంతలో వేధిస్తున్న విద్యుత్ సిబ్బంది కొరత

Date:24/02/2020

అనంతపురం ముచ్చట్లు:

అవసరమైన విద్యుత్‌ సిబ్బంది లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, గ్రామస్తులు కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. సదరన్‌ వపర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్పీడీసీఎల్‌) ‘అనంత’ విద్యుత్‌ సర్కిల్‌ పరిధిలో అనంతపురం, హిందూపురం, కదిరి, గుత్తి, కళ్యాణదుర్గం సబ్‌ డివిజన్లు ఉన్నాయి. జిల్లా విద్యుత్‌ శాఖలో మూడు ప్రధాన విభాగాలు ఉన్నాయి. ఇందులో  2,916 పోస్టులకు గానూ 917   ఖాళీగా ఉన్నాయి. లైన్‌మన్లతో పాటు అసిస్టెంట్‌ ఇంజనీర్లు, సబ్‌ఇంజనీర్లు, సీనియర్, లైన్‌మన్‌ డ్రైవర్, జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆఫీస్‌ సబార్టినేట్లు విభాగాల్లో ఎక్కువగా ఖాళీలు ఉన్నాయి.

 

 

 

వివిధ విభాగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది కొరత ఉండడంతో అటు ఆ శాఖ అధికారులు ఇటు వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.  ముఖ్యంగా లైన్‌మెన్ల కొరత వేధిస్తోంది. అసిస్టెంట్‌ లైన్‌మెన్లు 535 మంది ఉండాల్సి వుండగా 231 మంది పనిచేస్తున్నారు.  జూనియర్‌ లైన్‌మెన్లు 449 మందికిగాను  168 మంది పనిచేస్తున్నారు. ఈ రెండు విభాగాల పరిధిలో 585 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   సబ్‌ఇంజనీర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది.

 

 

విద్యుత్‌ ఫీజు పోటే వేసేవారు దిక్కులేరు. పెనుగాలులు, ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా విద్యుత్‌ సరఫరా ఆదిపోయన సందర్భంలో  పునరుద్ధరణకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రైతులే ఫీజులు వేసేందుకు యత్నించి మృత్యుపాలైన సంఘటనలు లేకపోలేదు. రాష్ట్ర విభజన తర్వాత నియామకాలు పూర్తిగా  నిలిచిపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని ఆ శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి.

డీలా పడ్డ కోడి మాంస విక్రయాలు

Tags: There is a shortage of power workers harassing Ananta

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *