Natyam ad

ముందస్తు లేదు క్లారిటీ ఇచ్చిన జగన్

విజయవాడ ముచ్చట్లు;

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత మంత్రులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికలంటూ బయట జరుగుతున్న ప్రచారాన్ని కొంత మంది మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళనున్నట్టుగా జగన్ వారికి తేల్చి చెప్పారు. ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారం అంతా రాజకీయమేనని.. పట్టించుకోవద్దని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు మరో తొమ్మిది నెలల్లో ఉన్నాయని.. కష్టపడితే మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని మంత్రులకు జగన్ తెలిపారు. తొమ్మిది నెలల పాటు కష్టపడండి.. మిగిలినది తాను చూసుకుంటానని మంత్రులకు జగన్ భరోసా ఇచ్చారు.చంద్రబాబు మేనిఫెస్టో విషయంలో ఎవరూ స్పందించవద్దని సీఎం జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలే ఎక్కువగా స్పందించడంతో వారే మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం వినిపించడంతో ఇక స్పందించవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు బీజేపీ, జనసేన , టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడబోతున్నాయన్న ప్రచారంపైనా జగన్ స్పందించినట్లుగా తెలుస్తోంది. వారంతా కలిసి వచ్చినా వార్ వన్ సైడేనని జగన్ ధీమా వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

Post Midle

Tags:There is no advance given the clarity of the pictures

Post Midle