ఐకెపి వడ్ల కొనుగోలులో రైతులకు తరుగు భారం తప్ప మరేభారం లేదు

కోహెడ ఎంపీటీసీ ఖమ్మం స్వరూప

సిద్దిపేట ముచ్చట్లు:

స్థానిక ఎంపిటిసి బిజెపి మండల అధ్యక్షులు ఖమ్మం స్వరూపవేంకటేశం మాట్లాడుతూ ధర్మసాగర్ పల్లిలో వడ్లకోనుగోలు సెంటర్ సందర్శించిన సందర్భంలో సెంటర్ నిర్వహికులు పర్యవేక్షించేవారు ఎవ్వరు లేరు అక్కడ రైతులు హమాలీలు నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు,సెంటర్ లో లైటింగ్ వసతి లేదని వడ్ల లోడింగ్ వెళ్లే సమయంలో కోహెడ పోలీస్ స్టేషన్ వద్ద కరెంటు వైర్లు తగిలి లారీలు సెంటర్ రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు ఆర్డీవో  ప్రతి వడ్ల కొనుగోలు సెంటర్ లో ఒక విఆర్ఏ ఉంటాడు సెంటర్ వద్ద నీటి వసతి, లైటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటలకే పరిమితం అయ్యింది తప్ప ఆచరణలో కనబడకపోవడం బాధాకరం. ఐకెపి వడ్ల కొనుగోలు లో రైతులకు సూతిల్ దారం ఫ్రీగా ఇస్తుంటే ఫ్యాక్స్ వడ్ల కొనుగోలు సెంటర్ లో రైతులే సూతిల్ దారం కొనుగోలు చేసుకొనే పరిస్థితి ఏర్పడింది అంటే ఒక్కో రైతుకు అదనపు భారం పడుతున్న నేపథ్యంలో దీనిపై జిల్లా కలెక్టర్ చొరవ చూపి ఐకెపి లో మాదిరిగానే ఫ్యాక్స్ కొనుగోలు సెంటర్ లో రైతులకు భారం పడకుండా ఒకేవిధంగా ఉండేలా చూడాలని కోరారు.

Post Midle

కోహెడ మండలంలోని శనిగరం ఐకెపి వడ్ల కొనుగోలు సెంటర్ లో మూడు కిలోల తరుగు ఇస్తేనే కొనుగోలు చేస్తామని ఐకెపి వారు మాట్లాడుతున్నారని రైతులు చెబుతున్నారు రైతులను నట్టేట ముంచెంసేవిధంగా వ్యవహరిస్తున్న వడ్ల కొనుగోలు సెంటర్ లను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు లేని పక్షంలో రైతుల కు మద్దతుగా కొనుగోలు సెంటర్ వద్ద నిరసన ప్రదర్శనలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ పల్లి బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు రస్కాల రాములు, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మామిడి కరుణాకర్ గౌడ్, ఐకెపి ఫ్యాక్స్ సెంటర్లలో ఉన్న రైతులు హమాలీలు తదితరులు ఉన్నారు.

 

Tags:There is no burden on the farmers except the depreciation burden in the purchase of IKP paddy

Post Midle
Natyam ad