జగన్ లాంటి సీఎం ఎవరు లేరు

#వైఎస్సార్ విగ్రహాలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నివాళులు
#రాష్ట్రం లో అభివృద్ధి పరుగులు తీస్తోంది

There is no CM like Jagan
There is no CM like Jagan

Date:23/05/2020

బి.కొత్త కోట ముచ్చట్లు:

వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఎవరు లేరని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన తంబాలపల్లి నియోజకవర్గం లో విస్తృతంగా పర్యటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన ఇదే రోజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. బి.కొత్తకోట, మండలాల్లోని దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన బి.కొత్తకోటలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. ఆయన సారథ్యంలో తాము ఎమ్మెల్యేలుగా పనిచేయడం అదృష్టమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం కలిగిస్తున్నారని అన్నారు. వై ఎస్ ఆర్ సి పి ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భ‌క్తుల‌కు సగం ధరకే  శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం

Tags: There is no CM like Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *