Natyam ad

మూడు రాజధానుల ఏర్పాటులో తలొగ్గేదిలేదు – ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ఆగ్రహం

-డబ్బుకు ఆశపడి అమరనాథరెడ్డి పార్టీ వదిలాడు
-బాబు, లోకేష్‌లు గోకమంటే గోకతారు
– ఎల్లోమీడియా ద్వారా తప్పుడు కథనాలు

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మేరకు మూడు రాజధానుల ఏర్పాటు అమలు చేసి తీరుతామని, వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని , ఎల్లోమీడియా ద్వారా అసత్య కథనాలు వెయించి , విబేదాలు సృష్టించే వారికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని…. చంద్రబాబునాయుడు, లోకేష్‌ లు గోకమంటే గోకడం, మాట్లాడమంటే మాట్లాడటం తెలుగుదేశం నాయకులకు అలవాటైందని , ప్యాకేజిల కోసం, మెప్పులు కోసం తెలుగుదేశం నాయకులు ప్రెస్‌మీట్‌లు పెట్టడంలో పసలేదని, మాజీ మంత్రి అమరనాథరెడ్డి తెలుగుదేశంలో చేరింది డబ్బుకోసం, మంత్రి పదవికోసమేనని, పుంగనూరును వారి కుటుంబం అభివృద్ధి చేయలేదని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పుంగనూరులో విలేకరుల సమావేశంలో ఆయన స్థానిక నాయకులతో కలసి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలు పుంగనూరు నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పట్టణానికి బైపాస్‌రోడ్డు, రోడ్లు విస్తరణ, డిపో ఏర్పాటు, మంత్రి కృషితో జరిగిందన్నారు. అమరనాథరెడ్డి కుటుంబం ఏళ్ల తరబడి పాలించినా ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని నిలధీశారు. పలమనేరు నియోజకవర్గాన్ని కూడ అభివృద్ధి చేయడంలో మంత్రి కీలకపాత్ర పోసిస్తున్నారని స్పష్టం చేశారు. అమరనాథరెడ్డి ప్యాకేజిల కోసం, వెహోప్పుల కోసం బైపాస్‌రోడ్డు వద్ద ఫోటోలు పెట్టుకోవడం, ఏల్లో మీడియాలో అసత్య కథనాలు రాయించడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. తెలుగుదేశం నాయకులు ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలంటు నిలధీశారు. లోకేష్‌, అమరనాథరెడ్డి, కిషోర్‌లు బాబు వద్ద మెప్పుల కోసం ఆరాట పడుతూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఎవరు పీకలేరని స్పష్టం చేశారు. తెలుగుదేశం నాయకులకు ,ఎల్లో మీడియాకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags: There is no consensus on the formation of three capitals – MLA Dwarkanatha Reddy’s anger

Post Midle

Leave A Reply

Your email address will not be published.