మహిళలపై వేదింపులను సహించేది లేదు

There is no endurance for women

There is no endurance for women

– మంత్రి పరిటాల సునీత
Date:16/03/2018
అమరావతి  ముచ్చట్లు:
పనిచేసే స్ధలంలో మహిళలపై వేదింపులను సహించేది లేదని రాష్ట్ర స్తీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. అమరావతి, సచివాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆద్వర్యంలో పనిచేసే చోట మహిళలపై లైంగిక వేదింపుల నిరోధ చట్టం పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిపుణులు, ప్రొఫెసర్, పోలీస్ శాఖ వారు చట్టంలో ఉన్న విధి విధానాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పరిటాల సునీత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2013 వ సంవత్సరంలోనే భారత ప్రభుత్వం చట్టాన్ని అమలులోకి తెచ్చినా చాలా మందికి దీనిపై అవగాహన లేదన్నారు. పనిచేసే స్ధలంలో లైంగిక వేధింపులు లేకుండా గౌరవంగా పనిచేయడం మహిళలకు  హక్కుగా భారత ప్రభుత్వం కల్పించిందన్నారు. పనిచేసే ప్రతి మహిళకు అవగాహన కల్పించేందుకే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 33 శాఖల్లో ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చెయ్యడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లా, మండల స్ధాయిలో త్వరలో కమిటీలు ఏర్పాటు చెయ్యాలని అధికారులకు ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. మహిళలు పనిచేసే చోట ఏమైనా వేదింపులకు గురవుతున్నట్లయితే డిప్రెషన్ కు లోనవకుండా కుటుంబ సభ్యులతో లేదా తోటి వారికైనా తెలియజేసి వేదింపులకు గురిచేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు ముందుకురావాలన్నారు. మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేటు కార్యాలయాల్లో కూడ ఇంటర్నల్ ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చెయ్యాలన్నారు. మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆందోళనలకు గురికాకుండా ఈ కమిటీ చూసుకుంటుందని మంత్రి తెలియజేశారు. సురక్షితమైన పని స్ధలం కోరుకోవడం మహిళల హక్కు అని మంత్రి అన్నారు. పనిచేసే స్ధలం వద్ద వేదింపులు జరిగినప్పుడు కుటుంబం పరువు పోతుందనో, అధికారులు ప్రతీకారంతో ఏం చేస్తారో అని మహిళలు బయపడకుండా ఫిర్యాదులు చేసినప్పుడే ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోగలుగుతామన్నారు. ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ కమీషనర్ అరుణ్ కుమార్, సెక్రటరీ కె.సునీత, ప్రొఫెసర్ శాంతి, అడ్వకేట్ అనుపమ, ఇన్ స్పెక్టర్ అరుణ మరియు సచివాలయంలోని మహిళా ఉద్యోగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి కార్యాలయం నుండి ఈ ప్రకటన జారీ చేయడమైనది.
Tags: There is no endurance for women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *