తారకరామాసాగర్ లో ప్రవేశరూసుం లేదు

Date:07/12/2019

విజయవాడ ముచ్చట్లు:

తారకరామాసాగర్ అభివృద్ధి కోసం చాంపియన్ యాక్ క్లబ్ వారికి టెండర్ అప్పగింత జరిగింది. దీనివల్ల ప్రతి నెల మున్సిపాలిటికి రూ.2 లక్షల ఖర్చు తగ్గుతుంది. ఇక నుండి ఛాంపియన్ క్లబ్ సంస్ధ నుండి ప్రతి నెల రూ. 30 వేల ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే మెరుగైన సేవలు అందించేందుకు ఆ సంస్ధ కృషి చేస్తుందని  సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం అయన మీడియాతో మట్లాడారు. నైట్ లైటింగ్, సిసి కెమెరాల ఏర్పాటు చేస్తారు. ఎటువంటి ప్రవేశ రుసుం చెల్లించనవసరం లేదు. బోటింగ్ ప్రయాణానికి నామమాత్రంగా టిక్కెట్ ధర తీసుకుంటారు. రాత్రి బస చేసేందుకు రూమ్ లను నిర్మించే అవకాశం పరిశీలన చేస్తున్నామని అన్నారు. చెరువులో చేపలు అక్రమంగా అమ్ముతున్నారంటూ ఆకతాయిల అసత్య ప్రచారం నమ్మవద్దు. నాది కక్కుర్తి పడే స్వభావం కాదు. పారదర్శకంగా పని చేస్తాను. వావిలాల ఘాట్ ను టూరిజం గా అభివృద్ధి చేస్తామని అయన అన్నారు.

 

వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు

 

Tags:There is no entry in Tarakaramasaur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *