తెలంగాణలో భాజపా-తెరాస మధ్య స్నేహపూర్వకపోటీ లేదు

There is no friendly relationship between the BJP and TRS in Telangana

There is no friendly relationship between the BJP and TRS in Telangana

బిజేపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా
Date:26/11/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పార్లమెంటులో భాజపాకు తెరాస పలుసార్లు మద్దతు తెలిపిన నేపథ్యంలో తెలంగాణలో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వకపోటీ ఉందని వస్తున్నా వార్తల ఫై బిజేపి జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా స్పందించారు. ‘తెలంగాణలో ఇరు పార్టీల మధ్య స్నేహపూర్వక పోటీ లేదు. పూర్తి స్థాయిలో భాజపా పోటీ చేస్తోందని స్పష్టం చేసారు. పార్లమెంటులో తెరాస ముందు రెండే మార్గాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం లేదా ప్రతిపక్షానికి మద్దతు తెలపడం. దీంతో వారు మాకే మద్దతు తెలిపారు. అంతమాత్రాన ఇరు పార్టీలు తెలంగాణలో స్నేహపూర్వకపోటీ చేస్తున్నట్లు కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ్‌ బెంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని ఆయన అన్నారు. సీబీఐ విషయంలో సీవీసీ జోక్యం చేసుకుని, చట్ట ప్రకారం వ్యవహరిస్తుందని అన్నారు. ఇందులో ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు ఎలా చేస్తారని ఆయన నిలదీశారు.
ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని, ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలో రాలేదని వస్తున్న వాదనలతో తాను ఏకీభవించబోనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే శాసనసభ ఎన్నికలు ముగియగా, మధ్యప్రదేశ్‌లో బుధవారం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘ఆ మూడు రాష్ట్రాల్లో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 11న వెలువడే ఎన్నికల ఫలితాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతి శక్తిమంతమైన, ప్రజలకు చేరువైన నేతగా రుజువు చేస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలిచి ఆయనే మళ్లీ ప్రధాని అవుతారు’ అని వ్యాఖ్యానించారు.
‘ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత, ప్రతికూలత అనే రెండు అంశాలూ ఉంటాయి. అయితే, దురదృష్టవశాత్తూ మీడియా ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతపైనే దృష్టి పెట్టింది. భాజపా ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో చేసిన అభివృద్ధి పనులు, సుపరిపాలనే అజెండాగా ప్రచారం చేస్తూ, మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు. తిరిగి భాజపానే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో మేము 129 ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశాం. కొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రభావం దేశంలోని ఓటర్లపై ఉంటుంది. 2014కి ముందు రెండు సార్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ పదేళ్ల కాలంలో ఆ రాష్ట్ర అభివృద్ధి నెమ్మదిగా జరిగింది. కానీ, 2014లో కేంద్రంలోనూ మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో మధ్యప్రదేశ్‌ మరింత వేగంగా అభివృద్ధి జరిగింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అనంతరం భాజపా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, హరియాణాతో పాటు చాలా రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల ప్రభావం పరస్పరం.. ఒకదానిపై ఒకటి పడుతోంది కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు మాకు చాలా ముఖ్యం’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ‘అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై మేము నిబద్ధతతో ఉన్నామన్న విషయం నిర్వివాదాంశం. ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో ఇన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబాల్‌ మరో డిమాండ్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల తరువాతే ఈ కేసుపై సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగాలని కోరారు. మా పార్టీకి ఈ విషయంలో ఉన్న ఉద్దేశంపై మాత్రం ఎవరికీ అనుమానాలు లేవు. ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారం మానుకోవాలి. ఇక శివసేన గురించి చెప్పమంటే, మావి రెండు వేర్వేరు పార్టీలు.. అయిప్పటికీ మేము ఒకే కూటమిలో ఉన్నాం. మాలో ఈ విషయంపై విభేదాలు లేవు’ అని అమిత్‌ షా చెప్పుకొచ్చారు.
Tags:There is no friendly relationship between the BJP and TRS in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *