ఆదాయం ఉన్నా…అధికారులకు పట్టని ఆలయం

There is no income ... a temple for the authorities

There is no income ... a temple for the authorities

Date:14/07/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలు జిల్లా శిరివెళ్ల మండల కేంద్రం నుంచి నల్లమల అడవిలో 30 కిలోమీటర్ల దూరంలో సర్వ నరసింహస్వామి ఆలయం వెలసింది. నాడు భక్తులతో కిటకిటలాడుతూ విరాజిల్లుతుండేది. నేడు భక్తుల రాక సగానికి సగం పైగా పడిపోయింది. ఆలయం ఒక పక్క గోడలు పడిపోయి కూలేందుకు సిద్దంగా ఉంది. ఈ ఆలయానికి ప్రతి భక్తులు అధికంగా వస్తుంటారు. ఈ ఆలయానికి చెందిన భూములు 21.50 ఎకరాలను ప్రతి ఏడాది కౌలుకు వేలం వేస్తారు. ఈ వేలం ద్వారా ప్రతి ఏడాది దాదాపు రూ. 3 లక్షల దాకా ఆదాయం వస్తుంది. హుండీలో భక్తులకు కానుకలను సమర్పిస్తుంటారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు రూ. 8 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అలాగే టెంకాయల వేలం ద్వారా రూ. 2.33 లక్షల ఆదాయం వస్తుంది. తలనీలాల ద్వారా రూ. 3.10 లక్షలు, కూల్‌డ్రింక్స్‌, తినుబండారములు, బొమ్మల షాపుల ద్వారా రూ. 35 వేలు, టికెట్లు రూ. లక్ష, స్వామి చదివింపులు రూ. 60 వేలు, కొబ్బరి చిప్పలకు రూ. 10 వేలు ఇలా ఆలయానికి ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయం వస్తున్నా ఆలయానికి మరమ్మతులు చేపట్టకపోవడం శోచనీయం. ఆలయంలో ఇఒ ప్రధాన ద్వారాన్ని సీజ్‌ చేసి ధ్వజ స్తంభం వద్దకు వెళ్లకుండా, ఆలయ ప్రదక్షిణలు చేయకుండా అడ్డుకట్టలు వేశారు. ఆలయ అధికారిగా ఉంటూ నిత్యం పర్యవేక్షించాల్సి ఉండగా వేలం పాటలు, హుండీ లెక్కింపులపై మాత్రమే దృష్టి పెట్టి, ఆలయంలో నిర్వహించే కళ్యాణం, ప్రత్యేక పూజలకు డుమ్మా కొడుతున్నారని భక్తులు, సిబ్బంది ఆరోపిస్తున్నారు. సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించకపోగా, పరుష పదజాలంతో దూషిస్తూ, మానసికంగా వేధిస్తున్నాడని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హుండీ లెక్కింపులు, భూముల కౌలు వే పాటలు తదితర వాటి లెక్కలు చూపకుండా దేవుడి పేరు చెప్పుకుంటూ స్వాహాకు తెరలేపారని విమర్శలు అధికమయ్యాయి. ఆలయం ఒక పక్క కూలేందుకు సిద్ధంగా ఉన్నా ఇఒ తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన విద్యుత్‌ బిల్లులు చెల్లించకుండా, ఆలయంలో కళ్యాణం, ప్రత్యేక పూజలకు ఖర్చు చేయకుండా పట్టణాలకే పరిమితం అయ్యాడని భక్తులు విమర్శిస్తున్నారు. త్రేత, తృతియ, ద్వాపర, కలియుగం నాటి నుంచి నేటికి ఆధ్యాత్మిక భావాలు పంచుతున్న ఆలయం  ప్రమాదపుటంచుల్లో ఉండడం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా దేవదాయ శాఖ వారు స్పందించి ఆలయాన్ని సందర్శించి, మరమ్మతులు చేపట్టాలని, అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని భక్తులు, సిబ్బంది కోరుతున్నారు.
ఆదాయం ఉన్నా…అధికారులకు పట్టని ఆలయం https://www.telugumuchatlu.com/there-is-no-income-a-temple-for-the-authorities/
Tags:There is no income … a temple for the authorities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *