There is no integrity

చిత్తశుద్ది లేదు

Date:19/09/2020

చిత్తూరు  ముచ్చట్లు:

పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి  అమరనాథ రెడ్డి శనివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ లోనే హిందూ దేవాలయాలపై దాడులు మతపరంగా ఒక విధమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.  గతంలో ఇలాంటి పరిస్థితి మేము ఎన్నడూ చూడలేదని అన్నారు.
ఈ తక్కువ కాలంలో ఒక్కసారిగా  ఎందుకు దేవాలయాలపై దాడులు జరుగుతున్న కార్యక్రమాలు  వస్తున్నాయో మొదట అర్థం కాలేదు. కానీ లోతుగా ఆలోచిస్తే దీని వెనుక ఏదైనా ఒక అజెండా ఉందా… రహస్య ఎజెండా  పెట్టుకుని ఈ దాడులను  నిర్వహించడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉందా.. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కఠినంగా ఉంటే ఇటువంటివి జరుగుతాయా అని ప్రశ్నించారు.

 

ప్రభుత్వంలో ఉండే మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి ఈ విషయంలో అవహేళనగా, గేలి గా, తేలికగా మాట్లాడుతూ తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు మాట్లాడితే  ఈ పరిస్థితి ఎక్కడిదాకా తీసుకెళ్తోంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అయన అన్నారు.
ఈ దేశం అన్ని  రకాల మతాలకు నిలయం. ఇక్కడ రకరకాల సంస్కృతులు, విభిన్న జాతులు, అన్ని మతాల కలయికే  భారతదేశం.. అటువంటి చోట ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఎందుకు ఆస్కారం ఉంది. ఇక పత్రికలలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్   ఓ విషయాన్ని టూకీగా ప్రకటన చేశారని అయన అన్నారు.

కర్ణాటకలో మళ్లీ వర్ష బీభత్సం..లోతట్టు ప్రాంతాలు జలమయం!

Tags: There is no integrity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *