మధు యాష్కిని విమర్శించే స్థాయి లేదు

హైదరాబాద్  ముచ్చట్లు:


మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మధుయాష్కిగౌడ్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామకృష్ణపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
టిఆర్ఎస్ పార్టీ నాయకులు  మధుయాష్కీ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  మధుయష్కిగౌడ్ ను విమర్శించే స్థాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని హెచ్చరించారు.  మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు.  నైతిక విలువలు ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రజా క్షేత్రంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కేవలం పదవీ కాంక్షతో రాజకీయ లబ్ది కొరకు,ఆస్తులను కాపాడుకోవడానికి,కేసుల నుంచి బయటపడడానికి మాత్రమే టిఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని అడుగడుగునా దిష్టిబొమ్మలు దహనం, నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:There is no level of criticism of Madhu Yashki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *