Natyam ad

ఐటి దాడుల్లో కక్ష సాధింపు వుండదు-ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్ ముచ్చట్లు:


మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ పై ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఈ మధ్య ఎవరికి ఐటీ నోటీసులు ఇచ్చిన అస్వస్థత పేరుతో హాస్పిటల్ కి వెళ్తున్నారు. బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నటువంటి మల్లారెడ్డి రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఐటీ లో కక్ష సాధింపు ఉండదు. మొబైల్ ఫోన్ చెత్త డబ్బా లో దాచుకోవాల్సిన అవసరం ఏముంది.. మల్లారెడ్డి దగ్గర పని చేసిన వారే పిర్యాదు చేసినట్టు అనుమానం. వాళ్ళ అనుమానం నివృత్తి చేయడానికి వచ్చారనుకుంటున్న. చట్టం ముందు అందరూ సామానులే.  రేపు నాకు నోటీసు ఇచ్చిన నిరూపించుకోవాల్సిందే. మీరు నిజాయితీ గా ఇన్కమ్ టాక్స్ కట్టినప్పుడు బయపడడం దేనికని అన్నారు.

 

 

అధికారులు వస్తే ఎందుకు తలుపులు తీయడం లేదు. నోటీసులు గౌరవ ప్రదంగా  స్వీకరించాలి. టీఆరెస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గనులు,ఫార్మా,కాలేజీల వ్యాపారాలు చేసే ఇన్కమ్ టాక్స్  కట్టని వారిపై దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ భాగస్వాములుగా ఉండి తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేసే వారిపై దృష్టి సారించింది. బిఎల్ సంతోష్ కేసు కోర్టులో ఉంది దానిపై మాట్లాడలేను. కోర్టు ఇచ్చే తీర్పు గౌరవిస్తామని అన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కాలేజీలు నడుపుతున్నారు. కొన్ని కాలేజీలకు ఐటి కడుతున్నారు..కొన్నటికి కట్టడం లేదు అనుకుంటా. టాక్స్ కట్టకేపోతే కట్టాలి..అంతే తప్ప ఉరి తీస్తారా..? ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ రావు చనిపోవడం బాధాకరం. పోడు భూములు సాగుచేసుకుంటున్న వాటికి పట్టాలు ఇవ్వాలని ఏడాదిగా అడుగుతున్నారు. తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూమి కి ఇప్పుడు కంచెలు కొడితే బతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నెల రోజుల్లో పట్టాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. గిరిజనులు చేసింది తప్పే ..రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.

 

 

Post Midle

పట్టాలు ఇస్తే ఇంత జరగకపోయేది. ఆదివాసీ ,గుత్తి కోయలకు విజ్ఞప్తి చేస్తున్నా.  ప్రభుత్వం పై ఒత్తడి పెంచుదాం. ఆకాంక్ష లు పోరాటాల తరువాత టీఆరెస్ ప్రభుత్వం చూపుతున్న వివక్ష కు వ్యతిరేకంగా దుబ్బాక అభివృద్ధి జరగాలని ఎమ్మెల్యే గా నన్ను గెలిపించారు. టీఆరెస్ కి మొదటి ఎదురు దెబ్బ దుబ్బాక ప్రజలు అందించారు. ప్రజల ఆకాంక్ష నియోజకవర్గ అభివృద్ధి మీద ఉంది . గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కి వచ్చిన విధంగా దుబ్బాక కి నిధులు రావడం లేదని నేను ముందు నుండి అడుగుతున్న .ఆంధ్ర ప్రాంత పాలకులు ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఇంత వివక్ష జరగలేదని అన్నారు.

 

 

ఈటెల రాజేందర్, హరీష్ రావు లు ఎమ్మెల్యేలు గా ఉన్నప్పుడు  అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ నిధులు ఖర్చుకు ఇచ్చారు. నా నియోజకవర్గ అభివృద్ధి కి 5 కోట్లు కేటాయిస్తే నన్ను ఖర్చు పెట్టుకోవడానికి ఇవ్వకుండా జిల్లా మంత్రి తనకి నచ్చిన టీఆరెస్ సర్పంచ్ లకు, నేతలకు పనులు ఇస్తున్నారని అన్నారు. ఇది మమ్మల్ని అహమనపర్చడమే. ముఖ్యమంత్రి కి బహిరంగ లేఖ రాస్తున్న. అందరిని సమదృష్టితో చూడాల్సిన మీరు వివక్ష చూపుతున్నారు. 5 కోట్ల నుండి 2 కోట్లు మన ఊరు మన బడికి ఖర్చు చేశారు. బీజేపీ నుండీ గెలిచానని నా మీద వివక్ష చూపుతున్నారు. మా పార్టీకి గెలిచిన వారికి మాత్రమే ఇస్తా అంటే మిమ్మల్ని ఫండ్ అడగం. సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రజలు తిరగబడతారని అవి ఇస్తున్నారు. దుబ్బాక కి రావాల్సిన నిధులు ఎవరికి సంబంధం లేకుండా అసెంబ్లీ అభివృద్ధి కి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

 

 

ఈ ఉత్తరాన్ని మెయిల్ ద్వారా మీకు పంపిస్తున్న. వారం రోజుల్లో స్పందించి..అసెంబ్లీ అభివృద్ధి ఫండ్ నాది నాకు ఇవ్వాలి.  నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు 5 కోట్లు నాకే ఖర్చు చేసుకునే అవకాశం కల్పించాలి. లేదంటే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు.

 

Tags: There is no partisanship in IT attacks – MLA Raghunandan Rao

Post Midle

Leave A Reply

Your email address will not be published.