ఆ ప్రెస్ నోట్ లో నిజం లేదు

There is no truth in that press note

There is no truth in that press note

Date:24/04/2019
నిజామాబాద్ ముచ్చట్లు:
ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రేరణతో నిజామాబాద్ పసుపు రైతులు వారణాసిలో నరేంద్ర మోడి పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే ప్రెస్ నోట్ తప్పని నిజామబాద్ బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ అన్నారు.   ఈ పదిమంది రైతులు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు.  వీరంతా మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కండువాలు మెడలో వేసుకుని ఆ పార్టీ కోసం పనిచేశారు. వీరంతా టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యులని అయన వెల్లడించారు. ఇందులో వ్యవసాయం చేసేవారు సగం మందే. అదీ పసుపు పండించే రైతు ఒక్కరు కూడా లేరు. కవిత గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని ఇచ్చిన హామీని మరచిపోయారు. పసుపు రైతులపై కవితకు నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఎందుకు బోనస్ ఇప్పించలేదు. పసుపు,ఎర్రజొన్నకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల బ్యాంకు ఖాతాలో వేస్తామని మా పార్టీ ఇటీవలి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని అన్నరు. పసుపు బోర్డు కూడా ఇస్తామని కూడా మా మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది. రైతులు, నియోజకవర్గం సమస్యలపై కవిత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది సమ్మర్ స్పాన్సర్ ప్యాకేజీ.  నామినేషన్లు వేసే వాళ్లంతా అ తరువాత సమ్మర్ ఎంజాయ్ ప్రోగ్రామ్ కు వెళ్తున్నారు.  ఇదంతా రాజకీయ డ్రామా అని అయన ఆరోపించారు.
Tags:There is no truth in that press note

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *