సీఎం కోసం..ఇంకా టైమ్ ఉంది

There is time now for the CM

There is time now for the CM

Date:26/11/2018
జైపూర్ ముచ్చట్లు:
రాజస్థాన్‌ ఎన్ని‍కల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని చాలా సర్వేలు చెబుతున్నాయి. అయితే సీఎం రేసులో కాంగ్రెస్‌ రాజస్థాన్‌ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో సచిన పైలట్‌ చెప్పిన సమాధానం అందరినీ అకట్టుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం మీడియా సచిన్‌ పైలట్‌ను ప్రశ్నించింది. దీనికి కాంగ్రెస్‌ నుంచి తాను ఏం తీసుకున్నారో వివరించారు. కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం ఎవరన్న ప్రశ్నపై పైలట్‌ మాట్లాడుతూ.. ‘నాకు 26 ఏళ్లప్పుడు కాంగ్రెస్‌ నుంచి ఎంపీగా గెలుపొందాను. కేవలం 31 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిని అయ్యా. 35 ఏళ్ల వయసులో కాంగ్రెస్‌ రాజస్థాన్‌ అధ్యక్షుడిని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు, నన్ను గెలిపిస్తూ వచ్చిన ప్రజలకు సేవ చేసుకునే సమయం ఆసన్నమైంది.
కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తాను. ప్రస్తుతం పార్టీకి విజయాన్ని అందించడమే నా ముందున్న లక్ష్యం. కాంగ్రెస్‌ నన్ను నమ్మి ఎప్పుడూ అవకాశం ఇచ్చింది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఓ సంప్రదాయం ఉంది. ముందుగా ఎన్నికలు జరుగుతాయి. పార్టీ విజయం సాదించాక ఎమ్మెల్యేలు తమ సీఎంను ఎన్నుకుటారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన తర్వాత సీఎం విషయం ఆలోచిస్తామని’ సచిన్‌ పైలట్‌ వివరించారు. కాగా, 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. వసుంధరా రాజే ముఖ్యమంత్రి అయ్యారు. కాగా, రాజస్థాన్‌లో ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున‍్నాయని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో పాటు డిసెంబర్‌ 7న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్‌ 11న విజయం ఎవరిదో తేలనుంది.
Tags:There is time now for the CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *