కట్టుదిట్టమైన భద్రత వుండాలి

Date:12/11/2018
రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:
ఎన్నికలల్లో పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి ఫెయిర్ అండ్  ఫ్రీ ఎన్నికలు జరిగేలా చూడాలని  అదనపు డీజీపీ  జితేందర్ అన్నారు. సోమవారం నాడు అయన జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి నార్త్ జోన్ ఐజిపి  నాగిరెడ్డి, కరీంనగర్ రేంజ్ డీఐజీ  ప్రమోద్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఇతర అధికారులు హజరయ్యారు.
ముందుగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  ఏలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన  చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లాలో ఎన్నికల కోసం తీసుకున్న పలు ముందస్తు చర్యల గూర్చి వివరించారు. జిల్లాలో వున్న  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు,   సమస్యలు జరగకుండా ముందస్తు ప్రణాలికను ను వివరింఆరు.
చెక్ పోస్ట్ లు, సమస్యాత్మక ప్రాంతాలలో నిర్వహిస్తున్న ఫ్లాగ్ మార్చ్ లు, ప్రజలకు ఎన్నికలపై అవగాహన  కార్యక్రమాలను కుడా వివరించారు.  ఈ సందర్భంగా అదనపు డి జి పి పోలీసు అధికారులను పలు వివరాలు అడిగారు.  ఎవరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో సమస్యాత్మక , అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని, ఆయా గ్రామాలలో ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకున్నారు, ఎంత మందిని బైండోవర్ చేశారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.
అదనపు డి జి పి మాట్లాడుతూ ఈ సారి ఎన్నికలను ప్రశాంతంగా,  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు  జరగకుండా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని  అన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం ప్రతి పోలీసు అధికారి  పక్కా ప్రణాళికతో  సిద్ధంగా వుండాలి. జిల్లాలో బెల్ట్ షాపుల ఒకటి కూడా నడవకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సాంకేతికనైపుణ్యన్నీ ఉపయోగించుకొని  పనిచెయ్యాలని సూచించారు.
ఎన్నికలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు అందరు తమ ఓటు హక్కును ఉపయోగించుకొనే విదంగా వారికి అవసరమైన చర్యలను తీసుకోవాలని సూచించారు. ఎలక్షన్ కు సంబంధించిన  చిన్న సంఘటన జరిగినా లేక ఫిర్యాదు  వచ్చినా వీడియోగ్రాఫ్,సీసీ కెమెరాలు సీసీ కెమెరా ఫుటేజ్ డాక్యుమెంటేషన్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ లను ఎల్లపుడు సందర్శిస్తూ, అక్కడి స్థానికులతో సత్సంబంధాలు కలిగి యుండాలి. అధికారులు ఇన్ ఫర్మేషన్ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించారు.శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారి పట్ల కఠినం గా వ్యవహరించాలని తెలిపారు.. ఎన్నికల ఏర్పాట్ల గురించి, వాటి ప్రణాళికల గురించి, పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు చేశారు.
Tags;There must be a strong security

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *