కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే.

అమరావతి ముచ్చట్లు:

రెడ్ లైట్ ఉల్లంఘన
– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.500

అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం
– మునుపటి జరిమానా: రూ.500
– ప్రస్తుత జరిమానా: రూ.2,000

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్
– మునుపటి జరిమానా: రూ.500
– ప్రస్తుత జరిమానా: రూ.5,000

అతివేగం
– మునుపటి జరిమానా: రూ.400
– ప్రస్తుత జరిమానా: రూ.1000

ప్రమాదకరమైన డ్రైవింగ్
– మునుపటి జరిమానా: రూ.1000
– ప్రస్తుత జరిమానా: రూ.5,000

డ్రంక్ అండ్ డ్రైవ్..
– మునుపటి జరిమానా: రూ.2000
– ప్రస్తుత జరిమానా: రూ.10,000

రేసింగ్, స్పీడింగ్
– మునుపటి జరిమానా: రూ.500
– ప్రస్తుత జరిమానా: రూ.5,000

హెల్మెట్ ధరించకపోవడం
– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు

సీట్‌బెల్ట్ ధరించకపోవడం
– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.1000

అత్యవసర వాహనాలను అడ్డుకుంటే..
– మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు
– ప్రస్తుత జరిమానా: రూ.10,000

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్
– ప్రస్తుత జరిమానా: రూ.1,200

ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్
– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్
– మునుపటి జరిమానా: రూ.1,000
– ప్రస్తుత జరిమానా: రూ.2,000

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమలులోకి వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం… ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే.. ఏకంగా రూ.25 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. దాంతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారు.

 

Tags: These are the new traffic rules.

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *