అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చడం సాధ్యమా!

Date:09/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికల నేపద్యం లో  అన్ని పార్టీలు మేనిఫెస్టోల రూపకల్పనలో తలమునకలవుతున్నారు. కాని ఎన్నికల ప్రచారాని  ప్రారంబించిన  తెలంగాణ రాష్ట్ర సమితి – కాంగ్రెస్ పార్టీ – తెలుగుదేశం పార్టీ – తెలంగాణ జన సమితి – వామపక్ష పార్టీలు ఎవరికి వారే అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు నెరవేర్చడం సాధ్యమా – కాదా అన్నది ఏ ఒక్క పార్టీ యోచించటం లేదు. అధికారం తెలంగాణ రాష్ట్ర సమితి పాత పథకాలను కొనసాగించడంతో పాటు – కొత్తగా మరిన్ని పథకాల రూపకల్పనకు శ్రీకారం చుడుతోంది. కల్యాణ లక్ష్మీ – షాదీ ముబారక్ – వృద్ధాప్య  ఫించన్లు – వంటరి మహిళకు ఇచ్చే ఫించన్లు రెట్టింపు చేస్తామని కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఈ హామీల అమలుకు లక్షల కోట్లు వెచ్చించారు.
ఆదాయం ఎక్కువగా వస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రపంచ బ్యాంకు నుంచి 2 లక్షల కోట్ల వరకూ అప్పు తీసుకున్నారు. ఆదాయం ఎక్కువగా ఉన్న అప్పు చేయాల్సి వచ్చిందంటే సంక్షేమ పథకాలు ఎంత భారంగా మారయో తెలుస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ తాము అధికరాంలోకి వస్తే పథకాలకు వెచ్చిస్తున్న వ్యయాన్ని రెట్టింపు చేస్తామని అంటున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు నుంచి తిరిగి రెట్టింపు అప్పు తీసుకుని వస్తారా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.అధికార పక్షాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు కూడా హామీల కోటాలు దాటుతున్నాయి. మేనిఫేస్టోలన్నీ మనీ ఫేస్టోలుగా మారుతున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న అన్ని పథకాలను తామూ కొనసాగిస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ పథకాలకు అదనంగా రైతు బంధు – రైతు బీమా – వితంతు పింఛన్లు  –  డ్వాక్రా  మహిళలకు రుణాల వంటివి రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తోంది. అధికారం కోసం ఇలా హామీలు గుప్పిస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రానికే 5 దేశాల బడ్జేట్ అవసరం అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా ఇంటి అద్దె కడతామని – నిరుద్యోగులకు నెలకు 5000 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తోంది. తెలుగుదేశం పార్టీ – తెలంగాణ జన సమితి లెక్కలు చెప్పకపోయినా హామీల కోటలు దాటుతున్నారు. సాధ్యం కాని హామీలతో ప్రజలను ఏమార్చి ఓట్లు సంపాదించుకున్న పార్టీలు అధికారంలోకి రాగానే అప్పుల బాట పడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Tags:These guarantees can be fulfilled after coming to power!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed