వారిది అలాయ్ బలాయ్

They are Alai Balayi
Date:11/10/2018
జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల పట్టణంలో టిడిపి కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎల్ రమణ, జీవన్ రెడ్డి ఒకే వేదికపైకి వచ్చి కుంభ మేళలలో తప్పిపోయి కలిసినట్టు ప్రెస్ మీట్ పెట్టుకొని అలాయి బలయి చేసుకున్నారు. ఉద్యమ నాయకుల ఆకాంక్షలు నెరేవేవేర్చలేరు అన్నారు.. ఇద్దరు నాయకులు. మీకు అసలు నైతిక హక్కు ఉందా? ప్రతి నాయకుడు అడుగడగున తెలంగాణకు అడ్డు వచ్చారని నిజమాబాద్ ఎంపీ కవిత అన్నారు. జీవన్ రెడ్డి వైఎస్ తో డీల్ చేసుకొని కేసీర్ పై పోటీ చేసారు. నేను ఓడిపోయినా, గెలిచినా పదవి ఇవ్వాలని మంత్రి అయ్యారు. ఎల్ రమణ ఆనాడు చంద్రబాబు కు బయపడి ఇంటి నుండి బయటకు రాలేదు. మీరు తెలంగాణ సాధన కోసం ఉద్యమించారా. మీరు కాంగ్రెస్ పార్టీ తో తెలంగాణ కోసం మాట్లాడారా అని అడిగారు. ఉద్యమం కోసం పదవులు కోసం వదులుకున్న తెరాస నాయకులు పదవుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని నిశ్శబ్దం పాటించింది జీవన రెడ్డి.
తెలంగాణ ఉద్యమం ఆకాంక్ష పరాయి పాలన వద్దని. మీరు మంత్రి గా ఉన్నపుడు మీకు ఎక్కడ భూములు ఉన్నాయి అక్కడ రోడ్లు జేఎన్టీయూ కాలేజ్ కట్టారు. విద్యార్థుల సదుపాయాల కన్నా మీ భూముల విలువ పెంచడానికి అక్కడ జేఎన్టీయూ తీసుకోవచ్చారు. నుకపల్లి హోసింగ్ బోర్డులో భూమి రేట్లు పెంచి మీ తమ్ముడి ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తో ఎక్కువ డబ్బులు తీసుకున్నా వాస్తవం కాదా అని అమె ప్రశ్నించారు. 16 కోట్లతో ఖర్చు చేసిన బైపాస్ రోడ్డు వేసారు పనికి రాని కేవలం మీ తమ్ముడు భూమి ఉందని రోడ్డు అక్కడ వేసారు. 2009 లో ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన అఫిడవిట్ లో హైదరాబాద్ బొల్లారం లోని 933 గజలు 20 లక్షలు విలువ గలా భూమి ఉందని పేర్కొన్న మీరు 2014 ఎన్నికలో 8000 గజలు అఫిడవిట్ లో పేర్కొన్నారు.
హైదరాబాద్ లో బొల్లారం లో 933 గజాల జగ 2014 లో 9000 గజాల భూమి ఎలా మారిందని అడిగారు. మీరు అఫిడవిట్ లో 2009 లో పేర్కొన్న తప్ప లేదా 2014 ఇచ్చిన తప్పా అని అడిగారు. ఇది నేను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తా. నేను సవాలు విసురుతున్న మీరు ఇద్దరు జగిత్యాల బిడ్డలైతే న పప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మొన్న మీరు చెప్పరు జగిత్యాల నుండి మీ జైత్రయాత్ర ప్రారంభిస్తామన్నారు కానీ మీ జైత్రయాత్ర కాదు అది తెరాస జైత్రయాత్ర అని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్ష పరాయి పాలన వద్దనే మల్ల రెండు పార్టీలు జత కట్టలు ఒకటేమో అమరావతి ఇంకోమో ఢిల్లీ నుంచి పరపలిస్తారు దయ చేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఆలోచించండని అన్నారు.
Tags:They are Alai Balayi