జగన్‌ పాలన చూసి ఆకర్షితులౌతున్నారు -మంత్రి పెద్దిరెడ్డి

– తెలుగుదేశం నాయకులు పార్టీలో చేరిక

 

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని రాష్ట్ర ఇంధన, అటవీ , గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో వైఎస్సార్‌సీపీ జనరల్‌ సెక్రటరీ జయకృష్ణ, కౌన్సిలర్‌ జయభారతి ఆధ్వర్యంలో 55 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన దామోదర్‌రెడ్డి , సురేంద్రరెడ్డి, కృష్ణయ్య, రమేష్‌, చంద్రకళరెడ్డి, నందినిరెడ్డి, రాధారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారెడ్డి, ఖాదర్‌బాషా, ఇర్ఫాన్‌, సలీం, బాబు, షబ్బిర్‌, గణేష్‌ తో పాటు పార్టీలో చేరిన వారికి మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప కలసి వీరందరికి పార్టీ కండువాలు వేసి , పార్టీలోకి చేర్చుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం నాయకులు పార్టీలో చేరారని తెలిపారు. ప్రభుత్వంలో కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌సీపీదేనన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకు అధికారులు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారందరికి తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు పార్టీని పటిష్టపరిచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యద ర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌ , పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇప్తికార్‌, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.

Tags: They are attracted by Jagan’s regime – Minister Peddireddy12

Leave A Reply

Your email address will not be published.