Natyam ad

విద్యా వ్యవస్థ పై వాళ్లవి తప్పుడు రాతలు: సీఎం జగన్

తాడేపల్లి ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలు, తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బ తినేలా యెల్లో మీడియా వ్యతిరేక రాతలు రాస్తోందని, కానీ, వాస్తవాన్ని వివరించి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులకు సూచించారు.
గురువారం విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు..

Post Midle

విప్లవాత్మక సంస్కరణలు..

నాణ్యమైన విద్యకోసం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా బడులు ప్రారంభమ్యయే తొలిరోజునే విద్యాకానుక కిట్‌ ఇస్తున్నాం. ఇందులో భాగంగా స్కూల్‌ బ్యాగు, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఉంటున్నాయి. వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్‌ ప్రారంభించే తొలిరోజే అందిస్తున్నాం. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో స్కూల్‌ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి. మనం ఆ విధానంలో మార్పు తెచ్చాం. మనం స్కూల్‌ ప్రారంభించిన తొలిరోజు పాఠ్యపుస్తకాలు ఇతర మెటీరియల్‌ అందిస్తున్నాం, ఇది గతానికి ఇప్పటికీ ఉన్న పెద్ద తేడా అని వివరించారు.
తప్పుడు రాతలతో..

 

ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యతిరేక మీడియా రాతలు రాస్తోందని అధికారులు ఈ సందర్భంగా.. సీఎం జగన్‌కు వివరించారు. సెకెండ్‌ సెమిస్టర్‌ ప్రారంభం అయినా.. ఇంకా పుస్తకాలు అందలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను అధికారులు ఖండించారు. డిసెంబరులో సెకెండ్‌ సెమిస్టర్‌ ప్రారంభం అవుతుందని, అలాంటిది ఇప్పుడే పుస్తకాలు అందలేదని రాయడం కచ్చితంగా తప్పుదోవ పట్టించడమేనని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్లో రెండో సెమిస్టర్‌ ప్రారంభం అవుతుందన్న విషయాన్ని అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొన్నామని, ఈ విషయం తెలిసీ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాశారన్నారు.

 

Tags: They are wrong writings on the education system: CM Jagan

Post Midle