తమకు ఎన్నికల ఫై ఓ స్పష్టత వచ్చింది

They got a clear picture of the election

They got a clear picture of the election

బలమైన అజెండాతో ప్రజల ముందు కెల్తాం
లీకులు, అసత్య వార్తలు గందరగోళానికి దారి తీస్తున్నాయి
ఎన్నికల్లో పోటీచేయనని ఎక్కడా చెప్పలేదు: కోదండరాం
Date:11/10/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
మహా కూటమిలో అన్ని అంశాలను త్వరగా తేల్చాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కాంగ్రెస్‌కు స్పష్టంచేశారు. న్యాయవాది ప్రహ్లాద్‌ తెజసలో చేరిన సందర్భంగా కోదండరాం మీడియాతో మాట్లాడారు. అమరుల ఆకాంక్షలే తమ ప్రధాన అజెండా అని.. ప్రజాస్వామ్య పాలన అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. పొత్తులు బలంగా ఉండాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని కాంగ్రెస్‌ వర్తమానం పంపిందని వెల్లడించారు. సీట్ల సర్దుబాటు, పొత్తుల అంశంపై సానుకూల నిర్ణయం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బలమైన అజెండాతో ప్రజల ముందుకు వెళ్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఓ స్పష్టత వచ్చిందన్నారు. లీకులు, అసత్య వార్తలు గందరగోళానికి దారి తీస్తున్నాయని చెప్పారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు తేలితే తప్ప గందరగోళానికి తెరపడదని స్పష్టం చేశారు. భాజపాలో చేరే ఆలోచన తనకు ఇప్పటి వరకూ లేదన్నారు.
తాను ఎన్నికల్లో పోటీచేయనని ఎక్కడా చెప్పలేదని.. పోటీ ఎక్కడ నుంచి అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.కూటమిలో గౌరవమైన భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నామని కోదండరాం చెప్పారు. ఉమ్మడి ప్రయోజనాల రీత్యా అన్ని విషయాలూ తొందరగా తేల్చాలని కోరారు. ప్రధానంగా తాము మూడు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కార్యాచరణ, ప్రణాళిక అమలు, కూటమిలో గౌరవప్రదమైన భాగస్వామ్యమే తమ ప్రధాన అంశాలని పేర్కొన్నారు. అన్ని విషయాలూ తొందరగా తేల్చుకోవాలని తాము కోరుకుంటున్న మాట వాస్తవమేనని, రెండు రోజుల్లో తేల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తమకు సంకేతాలు అందాయని, ఆ సమయంలోపే అన్నీ సర్దుకుంటాయని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో పొత్తులు చారిత్రక అవసరమని కోదండరాం వ్యాఖ్యానించారు. వాటిని నిలబెట్టుకునేందుకు తమ వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
Tags:They got a clear picture of the election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *