Natyam ad

భవన కార్మికుని పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి వైనం

మదనపల్లి ముచ్చట్లు:

మదనపల్లి కొత్త ఇండ్లలో కాపురము ఉంటున్న భవన కార్మికుని పై కొందరు యువకులు ఘాతుకానికి వడిగట్టారు. పట్టపగలే హత్యాయత్నంకు పాల్పడి, అతి దారుణంగా కొట్టి ఆపై ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి కాల్చి చంపడానికి ప్రయత్నం చేసిన అమానుష ఘటన మంగళవారం మదనపల్లిలో జరిగింది. వివరాలు.. మదనపల్లి మండలం కొత్త ఇండ్లు రంగారెడ్డి కాలనీలో కాపురం ఉంటున్న కాకర్ల ఆంజనేయులు కుమారుడు కె ప్రవీణ్ కుమార్ (35), పవన కార్మికునిగా పని చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏ వీధిలో ఉంటున్న కుమార్, అంజి మరికొంతమంది ప్రవీణ్ కుమార్ తాగి వస్తే తిడుతుంటాడని ఆగ్రహంతో అంతమొందించాలని పథకం వేశారు. అనుకున్న ప్రకారమే ఊరికి సమీపంలోని ఎలకపల్లి కుంట వడ్డిపల్లి బుట్టలోకి తీసుకెళ్లి పట్టా పగలే అతి కిరాతకంగా కొట్టి నడుము కాళ్లు చేతులు విరచి పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారు. ఈ ఘాతుకానికి వడిగట్టిన నిందితులు అక్కడ నుంచి పారిపోతునడాన్ని స్థానికంగా ఉన్న కొందరు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలం వద్దకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న ప్రవీణ్ కుమార్ ని హుటాహుటిన స్టానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి అతని పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటన సమాచారం అందుకున్న రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సుధాకర్ ఆసుపత్రికి చేరుకుని బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన గల కారణాలపై ఆరా తీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Post Midle

Tags: They poured petrol on the construction worker and set him on fire

Post Midle