Date:13/01/2021
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖలో ఓ మార్కెట్లో కుళాయి ట్యాప్‌లు, వాటికి సంబంధించిన పరికరాలను దొంగతనం చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసీపీ శ్రావణ్‌కుమార్ తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గత ఏడాది జూన్‌లో ఫిషింగ్ హార్బర్ వద్ద మోడ్రన్ ఫిష్ మార్కెట్‌ను ప్రారంభించారు. అయితే అనివార్య కారణాలతో దాన్ని మూసివేశారు. తిరిగి అక్టోబరు 17న ప్రారంభించేందుకు తెరిచారు. అయితే మార్కెట్లోపల కుళాయి కనెక్షన్లను ఇచ్చే ట్యాప్‌లు, మరుగుదొడ్డి సామగ్రి మాయమైనట్లు గుర్తించి, మత్స్యశాఖ జేడీ కె.ఫణిప్రకాష్ అక్టోబరు 20న ఫిర్యాదు చేశారు. ఏసీపీ పెంటారావు నేతృత్వంలో సి.ఐ. అవతారం బృందం దర్యాప్తు కొనసాగించింది. విజయవాడకు చెందిన కె.నరేష్ అలియాస్ శ్రీను అలియాస్ బెజవాడ అనే వ్యక్తి వీటిని దొంగిలించినట్లు గుర్తించారు. దొంగతనం చేసిన సామగ్రిని వన్‌టౌన్ ఏరియాకు చెందిన ఇప్పిలి రంగారావు అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరిద్దరిని అరెస్టు చేసి, దొంగిలించిన సుమారు 80వేల విలువైన కుళాయిలను స్వాధీనం చేసుకున్నారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Thief in police custody