Natyam ad

టయోటా కార్లలో నాజల్ పంప్స్ చోరీ చేసే దొంగ అరెస్ట్..

– రూ.20 లక్షలకు పైగా విలువైన నాజల్స్, కారు సీజ్..
– అరెస్ట్ వివరాలను వెల్లడించిన మదనపల్లి డి.ఎస్.పి కేశప్ప..

 

మదనపల్లి ముచ్చట్లు:

Post Midle

మదనపల్లి కేంద్రంగా టయోటా కార్లలో ఖరీదైన నాజల్ పంప్స్ దొంగలించే నిందితున్ని గురువారం ముదివేడు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి డిఎస్పి కేశప్ప మీడియాకు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పెద్దమండెం మండలం, కలిచర్ల బండమీద వీధికి చెందిన చాంద్ బాషా కుమారుడు ఎం.హర్షద్(19) మదనపల్లి కేంద్రంగా ఖరీదైన టయోటా కార్లలో గుట్టుచప్పుడు కాకుండా నాజల్ పంప్స్ చోరీ చేసేవాడన్నారు. చోరీ చేసిన నాజల్ పంప్స్ ను కారులో కర్ణాటక కు తరలించి బెంగళూరులో విక్రయించే వాడిని చెప్పారు. ఈ నేపథ్యంలో ముదివేడు పోలీసులు కార్లలో నాజల్ పంప్స్ విప్పుకుని కారులో బెంగళూరుకు తరలిస్తుండగా హర్షద్ ను మదనపల్లి సమీపంలో అదుపులోకి తీసుకుని అతని వద్ద పట్టుబడిన రూ. 20 లక్షల విలువ చేసే నాజల్ పంప్స్, కారును సీజ్ చేసి నిందితున్ని ముదివేడు పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్సై మరియు సిబ్బందిని డి.ఎస్.పి అభినందించారు.

 

Tags: Thief who steals nozzle pumps from Toyota cars arrested

Post Midle