ఆలయాల్లో దొంగలు పడ్డారు…
వరంగల్ ముచ్చట్లు:
దొంగలు రూట్ మార్చారు..ఇండ్లను వదిలి ఆలయాల వైపు చూస్తున్నారు. రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న గుడులపై మాత్రమే కన్నువేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో దొంగలు కేవలం వెంకటేశ్వర స్వామి ఆలయాలను టార్గెట్ చేస్తుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని నెలలుగా జిల్లాలో నెల్లికుదురు, కేసముద్రం, గార్ల మండలాలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు హల్ చల్ చేశారు. నెల్లికుదుర్ మండలంలోని చిన్నముప్పారం గ్రామంలో ఉన్న ఆలయం తలుపులు పగుల గొట్టి చోరీకి విఫలయత్నం చేశారు.ఈ సంఘటన పిదప కొన్ని రోజుల తర్వాత కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలోని భూనీలా వెంకటేశ్వర స్వామి ఆలయంలో తలుపులు పగులగొట్టి సుమారు రూ. 7 లక్షల సొమ్మును అపహరణ చేశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం గార్ల మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ చేసి సుమారు 12 కిలోల వెండి ఆభరణాలను దొంగలించారు. శ్రీవారి ఆలయాలలో జరుగుతున్న వరుస దొంగతనాలతో భక్తులు బెంబేలెత్తున్నారు.
దొంగతనాలపై క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు సైతం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. అనుమాతుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా దొంగతనాలకు పాల్పడేవారు మారు వేషాలతో ఉంటున్నట్లు, దీని మూలంగానే దొంగలను గుర్తించండం పోలీసులకు సవాల్ గా మారుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.జిల్లాలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాలను టార్గెట్ చేస్తూ దోపిడీ చేస్తున్నారు. వివిధ దేవుళ్ల పేరుతో కొంతమంది మాల ధారణ చేస్తూ భిక్షాటన చేస్తూ రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయిమీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డయల్ 100 కు తెలియజేయాలి. ఆలయాల్లో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక టాస్క్ చేస్తున్నాం. అనుమానితులను విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Tags: Thieves in temples…
