ఉడా కాలనీలో దొంగలు బీభత్సం

పెందుర్తి ముచ్చట్లు:


పెందుర్తి మండలం జీవీఎంసీ 97 వార్డు చిన్న ముషిడివాడ  ఉడా కాలనీ ఒక ఇంటిలో దొంగలు  బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి కిటికీ గ్రిల్స్ ను కటర్లతో కట్ చేసి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు, బీరువాలో ఉన్న 50 వేల రూపాయలు నగదు కొంత వెండి సామాన్లు డాక్యుమెంట్స్ తో పాటు టీవీ గ్యాస్ సిలిండర్స్ ఇన్వర్టర్ సీలింగ్ ఫ్యాన్లు సైతం  ఎత్తుకుపోయారు.. క్లూస్ టీమ్స్ కి ఎలాంటి ఆధారాలు దొరకకుండా దొంగలు ఇల్లు మొత్తం కారంపొడి జల్లారు. క్రైమ్ సీఐ బి వి జి రాజు, క్లూస్ టీం సంఘటన స్థలాన్ని చేరుకున్న వివరాలు సేకరిస్తున్నారు.

 

Tags: Thieves in Uda Colony

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *