తడ,సూళ్లూరుపేట లో దొంగలు హల్ చల్
అంతరాష్ట్ర దొంగల ముఠా గా అనుమానం
షాపులనే టార్గెట్టుగా చోరీ యత్నాలు
ఐదుగురు దొంగలు ఉన్నట్లు అనుమానం

నెల్లూరుముచ్చట్లు:
సూళ్లూరుపేట , తడ పట్టణాలలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు హల్ చల్ చేశారు. సూళ్లూరుపేట పట్టణం లో మూడు చోట్ల చోరీకి విఫలయత్నం చేశారు, అలాగే తడ లో కూడా మూడు చోట్ల చోరీకి ప్రయత్నించారు. సూళ్లూరుపేట లోని మోర్ సూపర్ మార్కెట్ షెట్టర్ తాళాలు పగలగొట్టి అద్దాలను బండరాళ్లతో కొట్టి లోనికి ప్రవేశించి ఉన్నారు. లోపల కంప్యూటర్ల క్రింద ఉండే కాష్ డ్రాలను పగలకొట్టే ప్రయత్నం చేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్నకేకే పాన్ బ్రోకర్స్ షాపు తాళాలు కూడా పగలగొట్టారు కానీ లోనికి వెళ్లలేక పోయారు. దానికి ఎదురుగా ఉన్న పాత అష్టలక్ష్మి సూపర్ మార్కెట్ షెట్టర్ తాళాలు కూడా పగలగొట్టి చోరీకి ప్రయత్నించి ఉన్నారు, తమిళనాడు కు చెందిన ఐదుగురు దొంగలు ఇలా హల్ చల్ చేసినట్లు సీసీ కెమెరాలలో రికార్డు ఐన వీడియోను బట్టి తెలుస్తుంది.
చెన్నై నుండి ముందుగా తడ లో చోరీలకు ప్రయత్నించి అనంతరం సూళ్లూరుపేట లోకూడా చోరీలకు పాల్పడినట్లు తెలుస్తుంది. తడ లో రెండు చోట్ల
చోరీకి విపలయత్నం చేసిన దొంగలు ఓ సెల్ ఫోన్ షాపులో మాత్రం కొన్ని సెల్ ఫోన్స్ లతో పాటు 20 వేలు నగదు చోరీ చేసినట్లు సమాచారం. దొంగలు రెండు మోటర్ బైకుల్లో వచ్చారు. అందరు ముసుగులు ధరించి ఉన్నట్టు సమాచారం .
Tags;
Thieves rampant in Tada and Sullurpet
