అమ్మాయిలు ఆలోచించుకోవాలి

Date:04/06/2019

హైదరాబాద్  ముచ్చట్లు :

అడుగు బయటకు పెట్టేముందే అమ్మాయిలు ఆలోచించుకోవాలి
క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ ఇంద్రజ
తెలుగు తెరపై కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఇంద్రజ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. “ఒక్క చిత్రపరిశ్రమలోనే కాదు .. ప్రతి రంగంలోనూ అమ్మాయిలు

జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వుంది. ఇంట్లో నుంచి అడుగు బయటకి పెడుతున్నప్పుడే ఆలోచించుకోవాలి.మనం ఎక్కడికి వెళుతున్నాము? ఎవరిని కలుస్తున్నాము? అక్కడ మనల్ని

కలిసేవారికి ఎంత దూరంలో గీత గీయాలి? మనం వెళ్లిన పని కానప్పుడు ఏం చేయాలి? ఇలా అమ్మాయిలు తమను గురించిన ఆలోచన చేయాలి. అవకాశం రాకపోతే పోయింది .. నేను ఇలాగే

వుంటాను అనే ఆత్మ స్థైర్యం కావాలి. మన లిమిట్స్ మనని రక్షిస్తూ వుంటాయన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఆ తరువాత బాధపడవలసిన అవసరం ఉండదు” అని చెప్పుకొచ్చారు.

నిజామాబాద్ జిల్లాలో బీజేపీ అనూహ్య విజయం

 

Tags:”Think of the girls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *