తృతీయ ప్రత్యామ్నాయం అవసరం

Date:14/07/2018
రాజమహేంద్రవరం ముచ్చట్లు:
ఈ దేశంలో ఇంకా అంటరాని తనం  ఉందంటే పాలకులు సిగ్గుపడాలి. కేవలం గ్రామాలలో కాని కాదు పట్టణాలు , నగరాలలో కూడా అంటరాని తనం కనపడుతోంది. నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చిన తరువాత గోరక్షక దళాల పేరుతో దళితులపై దాడులు మారిన్ని పెరిగిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఎస్సీల సమస్యలు-పరిష్కారాలు అనే అంశంపై  శనివారం నాడు రాజమండ్రీలో జరిగిన సదస్సులో అయన మాట్లాడారు. ఈ సదస్సుకు పలు రాజకీయ పార్టీల నేతలు హజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. చంద్రబాబుకు నాలుగేళ్ళ తరువాత దళితులు గుర్తుకు వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడేనా దళితుడికి కాని పేదవాడికి కాని ఒక్క ఎకరం భూమి ఇచ్చావా అని అడిగారు. గరగపర్రుకు ఎందుకు వెళ్ళలేదు. దళితులును ఎందుకు పరామర్శించలేదు. సామాజిక న్యాయం జరగాలని అయన అన్నారు. సామాన్యుడు రాజకీయలలోకి రాలేక పోతున్నాడు. కోటీశ్వరుడు కానీ ఎంపీలు లోక్ సభలో కాని రాజ్యసభలో కానీ రాష్ట్రంలో ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ పార్టీలో రెడ్లకు తప్ప ఎవరికీ అవకాశం ఇవ్వరు. కేవలం రెండు కుటుంబాలే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కావాలని అన్నారు. చట్టసభలలో సామాన్యుడు లేనంత వరకు ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు.  సీపీఐ , సీపీఎమ్ , జనసేన ఆధ్వర్యంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తాం.. సెప్టెంబరు 15 న అన్ని పార్టీలతో కలిపి భారీ ర్యాలి నిర్వహిస్తామన్నారు.
తృతీయ ప్రత్యామ్నాయం అవసరం https://www.telugumuchatlu.com/third-alternative-is-required/
Tags:Third alternative is required

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *