తెలంగాణలో ధర్డ్ వేవ్ కలకలం చిన్నారులకు కరోనా

హైదరాబాద్    ముచ్చట్లు:
తెలంగాణలో మరోసారి కరోనా కలకలం నెలకొంది. పాజిటివ్ కేసులు తగ్గినా..థర్డ్ వేవ్ భయం ప్రజల్ని వెంటాడుతోంది. తాజాగా చిన్నారులు వైరస్ బారిన పడుతుండటం భయాందోళనలకు గురి చేస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం జగదీష్‌ కాలనీకి చెందిన ఐదుగురు చిన్నారులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. చిన్నారులకు  స్థానిక ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా పాజిటివ్‌ వచ్చింది.చిన్నారుల తల్లిదండ్రుల్లోనూ పలువురికి కరోనా ఉన్నట్టు తేలింది. చిన్నారులను భద్రాచలం బండారు చందర్రావు(బీసీఆర్‌) ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నారులకు కరోనా బయటపడటంతో థర్డ్‌వేవ్‌ ప్రారంభమైందని భద్రాద్రి వాసులు భయపడుతున్నారు. ఆ చిన్నారులు నాలుగు సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు వారు కావడం గమనార్హం.కరోనా బారిన పడ్డ వారిలో ముగ్గురు బాలురు, ఇద్దరు బలికలు ఉన్నారు. అయితే ఈ చిన్నారులు తమ కుటుంబ సభ్యుల ద్వారా కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఐసో లేషన్‌ కేంద్రంలో నిర్వాహ కులు వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తు న్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం 492 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఖమ్మం జిల్లాలో 6,773 మందికి పరీక్షలు నిర్వహించగా 347 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో సోమవారం 14మంది పాజిటివ్‌తో చేరారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:Third wave in Telangana Corona for children

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *