ధర్డ్ వేవ్ టెన్షన్…కేంద్రం అలెర్ట్

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

దేశంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా సడలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసి, దాని ఆధారంగా ఆంక్షల విధించడం లేదా సడలింపులు ఇవ్వాలని సూచించారు. ఆంక్షల సడలింపు అనంతరం కూడా కరోనా నియంత్రణకు ఐదు సూత్రాలను అమలు చేయాలని స్పష్టం చేసింది.టెస్టింగ్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని తెలిపారు. పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాలన్నారు. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకమని వివరించారు. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అజయ్ భల్లా చెప్పారు.

 

 

 

పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని హెచ్చరించారు. ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. ఒకవైపు కరోనా వైరస్ రూపాంతరం చెందుతుండగా.. మరోవైపు ప్రజలు నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే రెండో దశకు దారితీసిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు.ఆరోగ్యశాఖలో ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్‌ సంస్థలు, వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి.. విస్తృతం చేయాలని కోరారు. దీనిద్వారా కొవిడ్‌ను కట్టడి చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: Third Wave Tension … Center Alert

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *