తిర్మన్ పల్లి ను సందర్శించిన సీఎస్

Date:05/06/2020

కామారెడ్డి ముచ్చట్లు:

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం తిర్మన్ పల్లి గ్రామంలో నర్సరీ, వైకుంఠ ధామం లను తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో  పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ సందీప్ కుమార్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘు నందన్ రావు, జిల్లా కలెక్టర్ శరత్ ఇతర అధికారులు పాల్గోన్నారు. సీఎస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశానుసారం మూడు జిల్లాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్య పనులను పరిశీలించేందుకు ఆకస్మికంగా రావడం జరిగింది.  గ్రామాల్లో ప్రజలను ఆరోగ్యంగా ఉంచడం కోసం పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి  డంపింగ్ యార్డ్, చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్, వైకుంఠ ధామం లను ఏర్పాటు చేసారని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం వచ్చింది ఇది ప్రపంచంలో ఎక్కడ లేదని అయన అన్నారు.

 నిన్న విజయవాడ,,, ఇవాళ అదిలాబాద్

Tags: Thirman Palli visited CS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *