Thiruchanur Sri Padmavathi Ammavari's spring festivities begin

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం

Date:06/05/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.వసంతోత్సవాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అలాగే రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ఆల‌య ప్రాంగ‌ణంలోనే అమ్మవారి ఊరేగింపు నిర్వ‌హిస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈఓ   ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈఓ   సుబ్రమణ్యం, కంకణభట్టార్   మణికంఠస్వామి తదితరులు పాల్గొన్నారు.

కుప్పం కో- అపరేటివ్ టౌన్ బ్యాంక్ స్కాంలో ఐదు మంది ఉద్యోగులపై కేసు నమోదు

Tags: Thiruchanur Sri Padmavathi Ammavari’s spring festivities begin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *