ముగిసిన తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి తెప్పోత్స‌వాలు

తిరుచానూరు ముచ్చట్లు:

 

తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు గురువారం ముగిశాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు.ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఉత్స‌వ‌మూర్తికి అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారికి ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించ‌నున్నారు.ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో   ప్ర‌భాక‌ర్ రెడ్డి, సూప‌రింటెండెంట్   మ‌ల్లిశ్వ‌రి, ఆల‌య అర్చ‌కులు   బాబుస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్   రాజేష్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: Thiruchanur Sri Padmavati Ammavari Theppotsavalu which ended

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *