Thirumala \ | / info

Thirumala | / info

Date:11/11/2109

తిరుమల ముచ్చట్లు:

ఓం నమో వేంకటేశాయ!!

సోమవారం  ఉదయం 6 గంటలసమయానికి తిరుమల: 18C°-27℃°.  నిన్న 82,593 మందిభక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది.  స్వామి వారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠంక్యూ కాంప్లెక్స్ లో 5గదిలో భక్తులు వేచిఉన్నారు. ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు 4 గంటలుపట్టవచ్చును,నిన్న 27,209 మందిభక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు రూ. 2.14 కోట్లు, శీఘ్రసర్వదర్శనం (SSD), ప్రత్యేక దర్శనం (ఆన్లైన్: రూ.300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయంపట్టవచ్చు.

గమనిక:

రూ.10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి, ఈనెల 12 మరియు 26నవృద్ధులు / దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం. (భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు) ఈనెల 13 మరియు 27నచంటిపిల్లల తల్లిదండ్రులకుశ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. వయోవృద్దులు/ దివ్యాంగులకు ఎస్వీ మ్యూజియంఎదురుగా గల కౌంటర్వద్ద వృద్దులు (65 సం!!)మరియు దివ్యాంగులకుప్రతిరోజు 1400 టోకెన్లుజారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు. చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు  సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటలవరకు దర్శనానికిఅనుమతిస్తారు.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి.TTD Toll free #1800425414.

 

పాఠశాలల అభివృద్ధి ప్రతిష్టాత్మకం

 

Tags:Thirumala \ | / info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *