తిరుమల \|/ సమాచారం

Date:19/11/2019

తిరుమల ముచ్చట్లు:

ఓం నమో వేంకటేశాయ!!

మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి, తిరుమల: 19C°-25℃.°  నిన్న 71,691 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్గినది. స్వామి వారి సర్వ దర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02గదిలో భక్తులు వేచిఉన్నారు.  ఈ సమయం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 06 గంటలు పట్టవచ్చు. నిన్న 25,588 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 3.90 కోట్లు, శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రూ. 300/-), దివ్య దర్శనం(కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చు. రూ. 10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి, ఈనెల 26న వృద్ధులు /దివ్యాంగులకు ప్రత్యేకఉచిత దర్శనం. (భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు). ఈనెల 27 న చంటి పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి
ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. వయోవృద్దులు/ దివ్యాంగులకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లుజారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి. ఉ: 10 కి మరియుమ: 2 గంటలకి దర్శనానికిఅనుమతిస్తారు. చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉ:11నుండి సా: 5 గంటలవరకు దర్శనానికిఅనుమతిస్తారు.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి TTD Toll free #18004254141.

 

విత్తనపు పొటేళ్ల ప్రదర్శన ప్రారంభించిన పెద్దిరెడ్డి

 

Tags:Thirumala \ | / info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *