By 6 am on Wednesday, Thirumala

By 6 am on Wednesday, Thirumala

Date:20/11/2019

తిరుమల ముచ్చట్లు:

ఓం నమో వేంకటేశాయ!!

బుదవారం ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 19C°-23℃°.  నిన్న 70,589 మంది భక్తులకు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.  స్వామి వారి సర్వ దర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 03గదిలో భక్తులు వేచి
ఉన్నారు.  శ్రీవారి సర్వ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పట్టవచ్చును.  21,949 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.94 కోట్లు, శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రూ.300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవా రిదర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టవచ్చు.  రూ.10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,  ఈనెల 26న వృద్ధులు /దివ్యాంగులకు ప్రత్యేకఉచిత దర్శనం. (భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగంచేసుకోగలరు) ఈనెల 27 న చంటి పిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. వయోవృద్దులు/ దివ్యాంగులకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్వద్ద వృద్దులు (65 సం!!) దివ్యాంగులకు ప్రతి రోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి.,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు. చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉ:11నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి.

TTD Toll free #18004254141.

 

మంత్రి కొడాలి నానిపై పరువు నష్టం దావా వెయ్యాలి

 

Tags:Thirumala \ | / info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *