Thirumala \ | / info

Thirumala | / info

Date:03/12/2019

తిరుమల ముచ్చట్లు:

ఓం నమో వేంకటేశాయ!!

మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి, తిరుమల: 19C°-23℃° నిన్న 80,474 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది. స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02 గదిలో భక్తులు వేచి ఉన్నారు. ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చు. నిన్న 25,062 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 3.40 కోట్లు, నిన్న 18,277 మంది భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది. శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రూ. 300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చు. రూ. :10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి, వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు. చంటి పిల్లల తల్లిదండ్రులు/ ఎన్నారై ప్రత్యేక దర్శనాలు సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి. TTD Toll free #18004254141

 

కలకలం రేపుతున్న మావోయిస్టు కరపత్రాలు

 

Tags:Thirumala \ | / info

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *