10న‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం

తిరుప‌తి ముచ్చట్లు:

 

తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో కార్తీక మాసంలో చివ‌రి ఆదివార‌మైన డిసెంబ‌రు 10న తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం జ‌రుగ‌నుంది.ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 గంట‌ల‌కు ఎదురు ఆంజ‌నేయ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 2 నుండి 4 గంట‌ల వ‌ర‌కు ఉభ‌య‌నాంచారుల‌తో క‌లిసి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆంజ‌నేయ‌స్వామివారి స‌న్నిధికి వేంచేపు చేసి ఏకాంతంగా తిరుమంజ‌నం చేప‌డ‌తారు. అక్క‌డ ఆస్థానం అనంత‌రం ఉభ‌య‌నాంచారుల‌తో కూడిన‌ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌ను ఆల‌య మాడ వీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యానికి తీసుకెళ‌తారు. దీంతో తిరువ‌డి స‌న్నిధి ఉత్స‌వం ముగుస్తుంది.

 

Tags: Thiruvadi Sannidhi Utsavam at Sri Govindarajaswamy Temple on 10

Post Midle
Post Midle