ఈ భవనం ఒకప్పుడు బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం

బద్వేలు ముచ్చట్లు:

 

పిచ్చి మొక్కలు మురికి కాలువల మధ్య ఉన్న ఈ భవనం ఒకప్పుడు బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం. ఇది అక్షర సత్యం ఈ భవనంలోనే డిపో మేనేజర్ తోపాటు సిబ్బంది విధులు

నిర్వహించేవారు. ఆ తర్వాత డిపో గ్యారేజీ ఏర్పడడం బస్టాండ్ విస్తరించడం గ్యారేజీ ముందు భాగంలోనే రహదారి పక్కన పక్క భవనాలు ఏర్పడడంతో డిపో మేనేజర్ కార్యాలయం ఆ భవనాల్లోకి

తరలిపోయింది. ఇప్పటికి కూడా డిపో మేనేజర్ కార్యాలయం పక్కా భవనాల్లోనే కొనసాగుతుంది. పక్కా భవనాల్లోకి డిపో మేనేజర్ కార్యాలయం తరలిపోయిన తర్వాత పాత భవనాన్ని అధికారులు

మర్చిపోయారు. పాత భవనాన్ని గతంలో ఒక ప్రవేట్ పాఠశాలకు అద్దెకిచ్చారు. ఆ ప్రైవేట్ పాఠశాల కూడా ఒకటి రెండు సంవత్సరాలు మాత్రమే ఇక్కడ కొనసాగింది. ప్రవేట్ పాఠశాల కాళీ చేసిన తర్వాత  ఆ

భవనం గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కార్యాలయం చుట్టూ పిచ్చి మొక్కలు దట్టంగా మొలిచాయి. భవనం పక్కనే మురికి కాలువ ప్రవహిస్తుంది కార్యాలయం చుట్టుపక్కల నివాస

గృహాలు ఉండడంతో మురికి కాలువల వల్ల నివాస గృహాల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గురించి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోయింది.

వర్షాకాలంలో అయితే ఇక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సంబంధిత అధికారులు ఈ భవనం విషయంలో స్పందించి చర్యలు తీసుకుంటే స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాక

ఎంతోకాలంగా ఈ భవనం నిరుపయోగంగా ఉండడంతో శిథిలావస్థకు చేరుకుంటుంది. మరి ఈ భవనం విషయం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి.

Tags: This building was once the Badwelu RTC depot manager’s office

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *