101 శాతం పెరిగిన ఈ కామర్స్

This commerce grew by 101 percent

This commerce grew by 101 percent

Date:21/11/2018
ముంబై ముచ్చట్లు:
ఈ కామర్స్‌గా పేరున్న ఆన్‌లైన్ వ్యాపారం విస్తరిస్తోంది. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో 11 శాతాన్ని ఆన్‌లైన్ వ్యాపారం ఆక్రమించే అవకాశాలున్నాయని నీల్‌సన్ సంస్థ నిర్వహించిన మార్కెట్ పరిశోధనల్లో వెల్లడైంది. 2016 వరకు మొత్తం వ్యాపారం లో ఆన్‌లైన్ వ్యాపారం 0.4 శాతమే ఉండేది. అయితే 2018లో ఈ అమ్మకాలు 1.3 శాతానికి పెరిగాయని పరిశోధన నివేదిక వెల్లడించింది. వచ్చే 12 సంవత్సరాల కాలంలో మొత్తం వ్యాపారంలో ‘ఈ కామర్స్’ 11 శాతాన్ని ఆక్రమించే అవకాశాలున్నాయని నీల్‌సన్  దక్షిణాసియా రీటెయిల్ మెజర్మెంట్, సర్వీసెస్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శుక్లా ఇక్కడ విలేఖరులకు తెలిపారు. మొత్తం వ్యాపారంలో ఆధునిక వ్యాపారం పదిశాతం జరుగుతుండగా అందులో పదిశాతం ఆన్‌లైన్ వ్యాపారం ఆక్రమించిందని ఆయన చెప్పారు. ఈ కామర్స్ చానల్ ద్వారా జరిగే అమ్మకాలు గత యేడాది 1శాతం నుంచి ప్రస్తుతం 101 శాతానికి పెరిగాయని పూర్తి కేటగిరీ వాల్యూ సేల్స్‌లో కొన్ని కేటగిరీలకు చెందిన ఉత్పత్తులు గణనీయమైన అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపారు. డయాపర్ లాంటి ప్రత్యేక వస్తువుల అమ్మకాలు 2016 నుంచి గత సెప్టెంబర్ వరకు నాలుగు శాతం నుంచి 9 శాతానికి పెరిగాయన్నారు. 2015 నుంచి సంప్రదాయ వాణిజ్యం కంటే ఆధునిక వాణిజ్యం వైపు వినియోగదారులు అధికంగా అకర్షితువుతున్నట్లు తేలిందన్నారు. ఈక్రమంలోనే మెట్రో నగరాల్లో 18 శాతం, సుమారు 10 లక్షల చిన్న పట్టణాల్లో 32 శాతం, మరో ఐదు లక్షల పట్టణాల్లో 33 శాతం, ఒక లక్ష పట్టణాల్లో 58 శాతం వంతున ఆధునిక వాణిజ్యం ద్వారా అమ్మకాలు జరిగాయని సర్వే నివేదిక వివరించింది. ప్రత్యేకించి జీతాలు వచ్చే తొలివారాల్లో 15 నుంచి 20 శాతం అదనపు అమ్మకాలు ఈదశగా జరిగినట్లు వివరించారు. ప్రత్యేకించి ప్రాంతీయంగా ఉన్న కంపెనీలు ఈ వ్యాపారంలో వేగంగా పుంజుకుంటున్నట్లు సర్వే తేల్చింది. ఇందులో ప్యాకేజీలతో కూడిన ఆహార వస్తువులు, పదార్థాల కేటగిరీలో అమ్మకాలు గడచిన సెప్టెంబర్  మాసంలో 31 శాతం పెరిగాయి.
Tags:This commerce grew by 101 percent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *