విజయవంతంగా కొనసాగుతున్న ఈ పాస్ 

Date:16/04/2019

సంగారెడ్డి ముచ్చట్లు :
తెలంగాణలో ఈ-పాస్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా 804 రేషన్‌షాపులు ఉన్నాయి. 3,70,756 కార్డులు ఉండగా.. 10 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. కాగా పోర్టబిలిటీ విధానాన్ని మొద టగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అమలు చేశారు. ఈ విధానం తో లబ్ధిదారులకు మేలు చూకూరుతుండటంతో సంతోషం వ్యక్తం చేశారు. ఒక వేళ డీలర్ల వద్ద సరుకుల కోటా అయిపోతే మళ్లీ డీడీ తీస్తే అదనంగా సరుకులు అందించనున్నారు.ఈ విధానం పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అం దించాలని సంకల్పించింది. రేషన్ లబ్ధిదారులు తాత్కలికంగా వివిధ ప్రాంతాల్లో జీవనం సాగిస్తుంటారు. లబ్ధిదారులు ప్రతి నెల తమకు కేటాయించిన షాపు లకు వెళ్లి సరుకులు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విషయా లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. పోర్టబిలిటీ విధానాన్ని ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో వారు ఉన్న చోటే సరుకులు అందిం చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ప్రతి రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లాలో ఈపాస్ అమలు, పోర్టబిలిటీ అమలు పక్కాగా ఉండటంతో సరుకులు పక్కదారి పట్టే అవకాశం లేదు. మొదటగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లో అమలు చేసిన ఈ పద్ధతి ద్వారా మంచి ఫలితాలు రావ డంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులకు పోర్టబిలిటీ విధానం ఎంతో ప్రయోజనకరంగా మారింది. ము ఖ్యంగా వలస జీవులకు ఈ విధానం ఊరటను కల్గిస్తుంది. గతంలో వ్యయా ప్రయాసలకు ఓర్చి సరుకుల కోసం తమకు కేటాయించిన దుకాణాల వద్దకు వచ్చి క్యూలో నిలబడి సరుకులు తీసుకునేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు.
వేరే దుకాణంలో కూడా తీసుకునే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలోని ఏ రేషన్ షాపులో అయిన తమకు రావాల్సిన సరుకులను లబ్ధిదారులు పొందవచ్చు.ప్రభుత్వ పోర్టబిలిటీ విధానంతో పాటు పలు నిబంధనలను అమల్లోకి తెచ్చింది. రేషన్ దుకాణం తెరవడం..మూసేందుకు అవసరమైన నిబంధనలకు సంబం ధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలి. ప్రతి నెల 15వ తేదీలోపు రేషన్ సరుకులు లబ్ధిదారులకు ఏ రేషన్‌షాపులో అ యినా సరుకులు అందించేలా చర్యలు తీసుకున్నారు. లేదంటే ఆ నెల రేషన్ కట్ అవుతుంది. తీసుకున్న సరుకుల వివరాలు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతాయి. ఈ విధానంతో లబ్ధిదారులకు డీలర్లు ప్రత్యేక శ్రద్ధతో సరు కులు అందిస్తున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రతి నెల 1 నుంచి 15 వరకు ఈ పాస్ విధానం ద్వారా రాష్ట్రంలోని ఏ రేషన్‌దు కాణంలోనైనా లబ్ధిదారులు సరుకులు తీసుకునేలా ప్రభుత్వం నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. కార్డుదారుల్లోకి ఇంటిలోకి సభ్యులెవ్వరైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ మిషన్ ద్వారా తమ వేలిముద్రలను వేసి సరుకులు తీసుకోవాలి. అయితే గడువులోపల సరుకులు తీసుకోకపోతే లబ్ధిదారులకు ఆ నెలలో కేటాయించిన సరుకులు ఆన్‌లైన్‌లో కట్ అయ్యేలా ప్రభుత్వం మార్గద ర్శకాలను రూపొందించింది.
Tags:This is a successful pass

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *