This is historic.

ఇది చారిత్రాత్మకం..

* కరోనా మహమ్మారి నుంచి..
* బాధితులకు విశిష్ట సేవలందించడంలో
* వైద్య, ఉద్యోగుల కృషి ఎనలేనిది
* వారి సేవలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..
* ప్రభుత్వ విప్ చెవిరెడ్డి

Date:17/10/2020

తిరుపతి ముచ్చట్లు:

దేశంలో కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొని సైనికుల్లా ముందువరుసలో నిలిచిన వైద్యులు, ఉద్యోగుల సేవలు చారిత్రాత్మకం అని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తుడా కార్యాలయం వేదికగా కరోనా కాలంలో బాధితులకు మెరుగైన సేవలందించిన వైద్యులు, ఉద్యోగులను మెమెంటోలతో ఘనంగా సత్కరించి గౌరావించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఏదేని ప్రభుత్వ రంగంలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను గుర్తించి సత్కరించడం స్వాతంత్ర్యం నుంచి అనాదిగా వస్తోందన్నారు. కానీ, కరోనా మహమ్మారి నుంచి ఎందరో అభాగ్యులకు సేవ చేసి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దిన శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ లో పనిచేసిన వైద్యులు, ఉద్యోగుల్లో ఏ ఒక్కరిదో ప్రతిభ చెప్పలేమన్నారు. వీరందరి సమిష్టిగా పనిచేయడంతో దేశ స్థాయిలో శ్రీ పద్మావతి నిలయంకు ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెవిరెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ తో బాధపడుతూ వచ్చిన బాధితులను అక్కున చేర్చుకొని అన్నీ తామై నిర్విరామంగా కృషి చేశారన్నారు. ఈ వైరస్ మహమ్మారి తమకు ఎదురవుతుందని తెలిసినా కూడా అయినా పర్వాలేదంటూ ధైర్యంగా, సాహసోపేతంగా ముందుకొచ్చి సేవలందించారని కొనియాడారు. దేశ రక్షణలో సైనికులు చూపే తెగువను కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడంలో వైద్య, ఉద్యోగులు సత్ సంకల్పంతో యజ్ఞం లా విధులు నిర్వహించారని వివరించారు. శ్రీ పద్మావతి నిలయం జిల్లా కోవిడ్ కేర్ సెంటర్ కు దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు, విశిష్ట గౌరవాన్ని తెచ్చిపెట్టిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుడా వీసీ హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తిరుచానూరు పంచాయతీ సేవలు..

శ్రీ పద్మావతి నిలయం లో కోవిడ్ సేవలు ఆరంభం నుంచి తిరుచానూరు పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నారని, గ్రామ సచివాలయ సిబ్బంది సేవలను చెవిరెడ్డి కొనియాడారు. పంచాయతీ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందించడంలో ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు.

కరోనా సేవకులు..

కరోనా కాలంలో బాధితులకు విశిష్ట సేవలందించిన వారిలో జిల్లా అదనపు వైద్యాధికారిని అరుణ సులోచన, ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏపీ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణ ప్రశాంతి, డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ రవిరాజు, డాక్టర్ యుగంధర్, డాక్టర్ శ్రీనివాస్ రావు తదితర వైద్య సిబ్బంది ఉన్నారు. ఉద్యోగుల్లో తుడా డీఈ రవీంద్ర, పురుషోత్తం రెడ్డి, తిరుచానూరు సెక్రటరీ జనార్ధన్ రెడ్డి, సమాచార శాఖ నుంచి డీఎల్ పీఆర్వో విజయసింహా రెడ్డి, సిబ్బంది రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు చర్యలు

Tags: This is historic.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *