SSC పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డి ఈ ఓ

Date:22/05/2020

పుంగనూరుముచ్చట్లు:

This is the d o who inspected the SSC test centers
This is the d o who inspected the SSC test centers

పుంగనూరు మండలంలో జూలై నెలలో జరగబోవు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ నరసింహ రెడ్డి, సహాయ పరీక్షల అధికారిని శ్రీమతి ప్రభావతి నేడు తనిఖీ చేశారు.పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బసవరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్ష హాలులో వెలుతురు ,ఫ్యాన్లు, టాయిలెట్స్ పరిశీలించారు. పరీక్షలలో సామాజిక దూరాన్ని పాటిస్తూ విద్యార్థులు పరీక్షలు వ్రాయడానికి అనుకూలంగా ఏర్పాట్లు ఉన్నాయో, లేదో అని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కేశవ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు అశ్వథ్ నారాయణ రావు, వెంకటరమణా రెడ్డి, బాలికఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుమల హాజరయ్యారు.

నాడు నేడు పనులపై సమీక్ష

Tags: This is the d o who inspected the SSC test centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *