ఎన్నికల హామీలు నేరవేర్చి ఓట్లు అడగడం ఇదే తొలిసారి -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి, ఓట్లు అడగడం భారతదేశంలోనే తొలిసారి జరుగుతోందని , ఇలా ఏ రాష్ట్రంలోను జరగలేదని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆరడిగుంటలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని బోయకొండ ఆలయ చైర్మన్‌ నాగరాజారెడ్డి ,ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయంలో డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించారు. గ్రామ కూడలీలో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేసి, మా నమ్మకం నువ్వే జగన్‌ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల సొంత నియోజకవర్గంలో 30 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగన్నర సంవత్సరంలో చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో , సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ శంకరప్ప, ఎంపీటీసీ నంజుండప్ప, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: This is the first time that election promises are being made a crime and asking for votes – MPP Bhaskar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *