ఇదే స్పూర్తి కొనసాగించాలి

This should continue to be inspired

This should continue to be inspired

Date:12/07/2018
అమరావతి ముచ్చట్లు:
పరిశ్రమల శాఖ అధికారులకు మంత్రి అమరనాథరెడ్డి సూచన సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్న పరిశ్రమల శాఖ అధికారులు భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో పని చేయాలని మంత్రి అమరనాథరెడ్డి అధికారులకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ కు అగ్రస్థానం దక్కిన నేపథ్యంలో గురువారం సచివాలయంలో పరిశ్రమల శాఖ అధికారులు మంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో ఏపికి అగ్రస్థానం దక్కడంలో అధికారులు చేసిన కృషి ఎనలేనిది. ముఖ్యమంత్రిగారి ఆలోచనలకు తగ్గట్లు పనిచేస్తూ పారిశ్రమిక ప్రగతికి సహకరించారు.  ఇదే స్పూర్తితో భవిష్యత్తులోనూ పనిచేసి ఏపిని పారిశ్రామిక అభివృద్ధిలో అగ్రపథాన కొనసాగేందుకు కృషి చేయాలని” మంత్రి సూచించారు. మంత్రిని కలిసివారిలో గుంటూరు, కృష్ణా జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు ఉన్నారు.
ఇదే స్పూర్తి కొనసాగించాలి https://www.telugumuchatlu.com/this-should-continue-to-be-inspired/
Tags:This should continue to be inspired

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *